Poco M7: పోకో M7 5G ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ! 7 d ago

Xiaomi సబ్-బ్రాండ్ అయినా పోకో (Poco) తక్కువ ధరలో మంచి ఫోన్లను అందిస్తూ మార్కెట్ లో పేరు సంపాదించుకుంది. పోకో ఇప్పుడు తన M సిరీస్‌లో సరికొత్త సంచలనం Poco M7 5Gని విడుదల చేసింది. 5G కనెక్టివిటీ, అద్భుతమైన ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్‌తో ఈ ఫోన్ మార్కెట్‌లో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించింది. బడ్జెట్ ధరలో 5G వేగాన్ని అందిస్తూ..మార్కెట్లో దూసుకుపోతుంది. ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి!
Poco M7 ఫీచర్లు:
డిస్‌ప్లే: 6.88 అంగుళాల IPS LCD
రిఫ్రెష్ రేటు: 120 Hz
ప్రాసెసర్: Qualcomm Snapdragon 4 Gen 2
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ v14, Hyper OS
బరువు: 205 గ్రాములు
బ్యాటరీ: 5160 mAh
ఛార్జింగ్: 18W ఫాస్ట్ ఛార్జింగ్
బ్యాక్ కెమెరా: 50 MP ఆటో ఫోకస్ కెమెరా
ఫ్రంట్ కెమెరా: 8 MP
వేరియంట్స్:
- 6GB RAM + 128GB స్టోరేజ్
- 8GB RAM + 128GB స్టోరేజ్
సెన్సార్లు: ఫింగర్‌ప్రింట్ సెన్సార్ (సైడ్), లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలెరోమీటర్, కంపాస్.
కనెక్టివిటీ ఫీచర్లు:
- 5G, 4G, VoLTE సపోర్ట్.
- Wi-Fi 5
- బ్లూటూత్ v5.0, GPS
- 3.5 mm ఆడియో జాక్
కలర్ ఆప్షన్స్:
- మింట్ గ్రీన్
- ఓసియన్ బ్లూ
- సాటిన్ బ్లాక్
ఫోన్ ధర:
- 6GB RAM, 128GB స్టోరేజ్-- రూ.9,249
- 8GB RAM, 128GB స్టోరేజ్-- రూ.10,999
మైనస్ పాయింట్స్:
- తక్కువ రిజల్యూషన్ స్క్రీన్
- చీకట్లో కెమెరా అంత బాగా పనిచేయదు
- NFC లేదు
- పాత బ్లూటూత్ వెర్షన్
పోకో ఫోన్లు సాధారణంగా మధ్యతరగతి కుటుంబాలను ఆకర్షిస్తాయి. అసలు రూ.10 వేల లోపు 5G ఫోనెలే దొరకట్లేదు అనుకుంటే.. పోకో ఇంత తక్కువ ధరకే మంచి ఫీచర్లతో Poco M7 5G మొబైల్ ని అందిస్తుంది. ప్లాస్టిక్ బాడీ, సాఫ్ట్‌వేర్ సమస్యలు వంటి లోపాలు ఉన్నప్పటికీ.. ఈ ధరలో చాల మంచి ఫోన్ ఇది. ప్రస్తుతం ఈ ఫోన్ కేవలం ఫ్లిప్‌కార్ట్ లో మాత్రమే అందుబాటులో ఉంది. బడ్జెట్ ధరలో అత్యాధునిక సాంకేతికతను ఆస్వాదించాలనుకునే వారికి Poco M7 5G ఒక అద్భుతమైన ఎంపిక.
ఇది చదవండి: "Moto G04s" సింపుల్ కాదు.. సూపర్ స్మార్ట్‌ఫోన్!